మస్కట్‌ లో పేలిన ఎయిర్‌ కండిషనర్‌: ఒకరి మృతి

- June 07, 2018 , by Maagulf
మస్కట్‌ లో పేలిన ఎయిర్‌ కండిషనర్‌: ఒకరి మృతి

మస్కట్‌:సెంట్రల్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ యూనిట్‌ పేలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మస్కట్‌లో చోటు చేసుకుంది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్‌ ఆఫ్‌ బౌషర్‌లో ఈ ఘటన జరిగింది. మెయిన్‌టెనెన్స్‌ వర్క్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎయిర్‌ కండిషనింగ్‌ యూనిట్‌ పేలిందని పిఎసిడిఎ పేర్కొంది. విలాయత్‌ ఆఫ్‌ బౌషెర్‌లోని ఓ భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com