మస్కట్ లో పేలిన ఎయిర్ కండిషనర్: ఒకరి మృతి
- June 07, 2018
మస్కట్:సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిన ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలపాలయ్యారు. ఈ ఘటన మస్కట్లో చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, విలాయత్ ఆఫ్ బౌషర్లో ఈ ఘటన జరిగింది. మెయిన్టెనెన్స్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఎయిర్ కండిషనింగ్ యూనిట్ పేలిందని పిఎసిడిఎ పేర్కొంది. విలాయత్ ఆఫ్ బౌషెర్లోని ఓ భవనంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







