రంజాన్ సందర్భంగా జనసేన యాత్రకు విరామం: పవన్ కళ్యాణ్
- June 09, 2018
రంజాన్ సందర్భంగా జనసేన పోరాట యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రంజాన్ తర్వాత తిరిగి యథావిథిగా జనసేన పోరాయ యాత్ర కొనసాగనుందని జనసేన ఓ ప్రకటన ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లింలు ఉండటం చేత పవన్ యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. నిన్న యలమంచిలి బహిరంగ సభ ముగించుకొని విశాఖలో ఓ ప్రైవేటు రిసార్ట్స్ లో బస చేసారు జనసేనాని.
ఈరోజు ఉదయం నుండి పవన్ కల్యాణ్ విశాఖకు చెందిన కొందరు మేధావులుతో వరుస సమావేశం అవుతున్నారని ఆ పార్టీ మీడియా హెడ్ హరిప్రసాద్ ప్రకటన విడుదల చేశారు. పవన్‌ను కలిసిన వారిలో ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం సమసిపోవడానికి అవిశాత్రంగా పోరాటం చేస్తోన్న కుప్పం యూనివర్శిటీ మాజీ వైస్ ఛాన్సలర్, యూనియన్ పబ్లిక్ కమిషన్ లో సేవలు అందించిన ప్రొఫెసర్ కేఎస్ చలం కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై మూడు రోజులపాటు మేధావులతో చర్చించనున్నారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి వీరితో సమావేశాలు నిర్వహించి సోమవారం సాయంత్రం హైదరాబాదు బయలు దేరనున్న పవన్ కళ్యాణ్.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..