ఇండియా:విదేశీ పర్యాటకులకు జీఎస్టీ రిఫండ్
- June 10, 2018
న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటించడానికి వచ్చిన విదేశీ పర్యాటకులకు కాస్త ఊరట లభించనుంది. ఇక్కడ కొనుగోలు చేసే వస్తువులపై పడే వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) తిరిగి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. రెవెన్యూశాఖ ఈ మేరకు కసరత్తులు చేస్తోంది. తొలుత అనుకున్న దాని ప్రకారం విమానాశ్రయాల్లోని 'పన్ను రహిత' విక్రయశాలల్లో అంతర్జాతీయ ప్రయాణికులు కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటికే వివిధ దేశాలు తమ దేశంలో పర్యటించే వారికి వ్యాట్, జీఎస్‌టీలను తిరిగి చెల్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో పర్యటించే వారికి జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే దీనిపై చర్చిస్తున్నారు. 'ఫేక్ బిల్లులపై ఎలాంటి రిఫండ్ లభించదు. కేవలం పెద్ద పెద్ద రిటైలర్లు ఇచ్చే బిల్లులపై విధించిన జీఎస్‌టీని మాత్రమే తిరిగి చెల్లిస్తాం' అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయాల్లో విక్రయించే వస్తువులపై జీఎస్‌టీ విధించొచ్చని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)కు చెందిన దిల్లీ బెంచ్ మార్చిలో ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఇప్పటికే పలువురు అభ్యర్థించారు. పన్ను రహిత షాపుల్లో కొనుగోళ్లపై జీఎస్‌టీ విధించకుండా త్వరలోనే స్పష్టత ఇస్తామని సంబంధిత అధికారు చెప్పారు. పరోక్ష పన్ను విధానంలో కేంద్ర విక్రయ పన్ను (సీఎస్‌టీ), విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ల నుంచి పన్ను రహిత షాపులకు మినహాయింపు ఉండేది. అంతర్జాతీయ అవగాహనలో ఇవి భాగమని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







