షార్జా:టబ్‌లో మునిగి బాలిక మృతి
- June 13, 2018
షార్జా:21 నెలల బాలిక, వాటర్ టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఘటన షార్జాలో చోటు చేసుకుంది. బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఘటన గురించిన సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, బాలికను రక్షించేందుకు ప్రయత్నించారు, ఆమెను ఆసుపత్రికి తరలించారు. కాగా, ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, ఘటన ఎలా జరిగిందన్నదానిపై ఆరా తీశారు. బాలిక తల్లిదండ్రులు, తమ బంధువుల ఇంటికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కా చెల్లెళ్ళు బాత్ టబ్‌లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆసుపత్రికి తరలించే సమయానికే బాలిక మృతి చెందింది. నీటిని అధికంగా తాగేయడం వల్ల ఊపిరి ఆడక బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..