యూఏఈ వీసా ఆన్ అరైవల్: ఇండియన్స్‌కి అర్హత ఎలాగంటే..
- June 13, 2018
దుబాయ్ రెసిడెన్సీ అథారిటీ, యూఏఈ వీసా ఆన్ అరైవల్ పొందేందుకు ఇండియన్స్ ఏం చేయాలో వివరిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈద్ అల్ ఫితర్ దగ్గరవుతున్న నేపథ్యంలో చివరి నిమిషంలో యూఏఈ రావాలనుకునే భారతీయులకు యూఏఈ వీసా ఆన్ అరైవల్‌కి సంబంధించి రిమైండర్‌ని జారీ చేసింది. యునైటెడ్ కింగ్‌డమ్ లేదా యూరోపియన్ కంట్రీస్‌కి సంబంధించిన రెసిడెన్సీ వీసా వున్నవారికి, అమెరికన్ వీసా లేదా గ్రీన్ కార్డ్ వున్నవారికి ఈ వీసా ఆన్ అరైవల్ వర్తిస్తుంది. అయితే రెసిడెన్సీ వీసాలు 6 నెలలకు పైబడి చెల్లుబాటయ్యేలా వుడాలి. ఎంట్రీ పర్మిషన్ కోసం 100 దిర్హామ్‌ల రుసుముని, అలాగే 20 దిర్హామ్‌లు సర్వీసు ఫీ ఛార్జ్‌గానూ చెల్లించాల్సి వుంటుంది. ఇలా వీసా ఆన్ అరైవల్ పొందేవారికి అత్యధికంగా 14 రోజులపాటు యూఏఈలో స్టే చేసే అవకాశం వుంది. దీన్ని మరోసారి పొడిగించుకునేందుకూ అవకాశం వుంది. దీనికోసం 250 దిర్హామ్‌ల రెన్యువల్ ఫీజు, 20 దిర్హామ్‌ల సర్వీసు ఫీజు చెల్లించాలి. ఎక్స్‌టెన్షన్ పొందేవారికి 28 రోజులు స్టే చేసే అవకాశం లభిస్తుంది. ఓవర్ స్టేయింగ్‌కి (ఒక రోజుకి) 100 దిర్హామ్‌ల జరీమానా తప్పదు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..