ఫుడ్ పాయిజన్ అయినప్పుడు పాటించాల్సిన చిట్కాలు....
- June 13, 2018
జీవన పోరాటంలో ప్రతి వ్యక్తీ కాలంతోపాటు పరుగెడుతున్నాడు. దీంతో కనీసం ప్రశాంతంగా కూర్చొని భోజనం చేసే సమయం కూడా లేకుండా పోతోంది. అందువలన కంటికి కనిపించిన హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్లని ఇలా ఎక్కడపడితే అక్కడ ఏది దొరికితే అది ఆరగిస్తూ ఆకలి బాధను తీర్చుకుంటున్నారు.
ఇలా చేయడం వలన చాలా మంది ఫుడ్ పాయిజనింగ్ బారినపడుతుంటారు. ఇలా జరిగినప్పుడు వాంతులు, విరేచనాలు అవుతుంటాయి. కాబట్టి వీటినన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలను తెలుసుకుంటే తప్పించుకోవచ్చును.
కడుపులో వికారంగా అనిపించినపుడు కొంచెం జీలకర్ర నోట్లో వేసుకుని నమిలి ఆ రసాన్ని మింగితే మంచి ఫలితం లభిస్తుంది. ఒక గ్లాసు నీళ్లలో స్పూన్ జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఆ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి కడుపులో మంటకి మంచిది. పొట్టలో వికారంగా అనిపిస్తునప్పుడు రోజు స్పూన్ తేనెను తీసుకుంటే ఫుడ్ పాయిజన్ నుండి తప్పించుకోవచ్చును.
ఫుడ్ పాయజన్ వలన శరీరంలోని పొటాషియం పరిమాణం తగ్గిపోతుంది. అప్పుడు మీరు నీరసంగా కనిపిస్తారు. అలాంటప్పుడు వెంటనే ఒక అరటిపండు తింటే మంచిది. అలాకాకుంటే రెండు అరటి పండ్లను పెస్ట్‌లాచేసుకుని పాలలో కలిపి తీసుకున్నా కూడా ప్రయోజనం ఉంటుంది. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటుంది. అందుచేత ఫుడ్ పాయిజన్ అయిన వ్యక్తి కప్పు పెరుగు తీసుకుంటే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







