ఇ-సర్వీసుల్లో అంతరాయం
- June 15, 2018
బహ్రెయిన్ కింగ్‌డమ్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఇ-గవర్నమెంట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోంది. గత మూడు రోజులుగా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు బహ్రెయినీ పౌరుడు అబ్దుల్ అజీజ్ అహ్మద్ చెప్పారు. కొన్ని సర్వీసులు అసలు యాక్సెస్ కావడంలేదనీ, మరికొన్ని లాగిన్ తర్వాత సమస్యలకు గురవుతున్నాయని ఆయన చెప్పారు. యాహ్యా అనే మరో సిటిజన్ మాట్లాడుతూ, మాన్యువల్‌గా చేసుకుంటే తక్కువ సమయంలోనే పని పూర్తయ్యేదనీ, ఆన్‌లైన్ ద్వారా చేయాల్సి రావడంతో సమస్య తీవ్రంగా మారిందని అన్నారు. ఎలక్ట్రానిక్ ఛానెల్స్‌ని అప్‌డేట్ చేస్తున్నామనీ, ఈ క్రమంలో తలెత్తిన సాంకేతిక సమస్యలకు చింతిస్తున్నామని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అతి త్వరలోనే ఈ సర్వీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తాయని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..