ఈద్‌ సెలవుల్లో జజాయెర్‌ బీచ్‌ ఆహ్వానం

- June 15, 2018 , by Maagulf
ఈద్‌ సెలవుల్లో జజాయెర్‌ బీచ్‌ ఆహ్వానం

ఈద్‌ అల్‌ ఫితర్‌ సెలవుల నేపథ్యంలో జజాయెర్‌ బీచ్‌ సందర్శకులకు అందుబాటులో వుంటుందని సదరన్‌ ఏరియా మునిసిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అహ్మద్‌ అల్‌ అన్సారీ చెప్పారు. ఈ బీచ్‌ సందర్శకులకు అనుమతి ఇవ్వడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టూరిజం ప్రాజెక్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ నేపథ్యంలో బీచ్‌లోకి సందర్శకుల రాకకు చెక్‌ పెట్టారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన అహ్మద్‌ అల్‌ అన్సారీ, 9వ కాన్‌స్టిట్యూయెన్సీ రిప్రెజెంటేటివ్‌ ఎంపీ మొహ్‌సెన్‌ అల్‌ బాక్రి, జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. బీచ్‌లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ బీచ్‌ని మూసివేయలేదని వారు తెలిపారు. వర్క్‌ జరుగుతున్న ప్రాంతాల్లో బ్యారియర్స్‌ వున్నాయనీ, ఆ ప్రాంతంలోకి వెళ్ళకుండా గార్డ్స్‌ని ఏర్పాటు చేయడం మాత్రం జరగలేదని అల్‌ అన్సారీ స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com