సమ్మోహనం:రివ్యూ
- June 15, 2018
సినిమా పేరు : సమ్మోహనం
తారాగణం : సుధీర్ బాబు, అదితిరావ్ హైదరీ, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ తదితరులు
సంగీతం : వివేక్ సాగర్
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
నిర్మాత : శివలెంక కృష్ణప్రసాద్
విడుదల : 15.6.18
అష్టాచెమ్మా, జెంటిల్ మేన్, అమీతుమీ వంటి సినిమాలతో ఆకట్టుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సారి ఎమోషనల్ లవ్ డ్రామాను తెరకెక్కించారు. సుధీర్ బాబు హీరోగా, అదితిరావ్ హైదరీ హీరోయిన్ గా మంచి టైటిల్ " సమ్మోహనం " తో సరికొత్త ప్రేమ కథాచిత్రాన్నిఅందించారు. తెలుగు రాని హీరోయిన్, ఆమెకు తెలుగు నేర్పే వ్యక్తిగా హీరో చేసిన ప్రయత్నాలు, సినిమావాళ్ళ కష్టాలు, కాస్తంత కామెడీ జోడించి ఈ సినిమాను ఇంద్రగంటి తీర్చిదిద్దాడు. సమ్మర్ ముగుస్తున్న ఈ సీజన్ లో సమ్మోహనం నిజంగా ఆడియెన్స్ ని సమ్మోహనపరిచిందా లేదా తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళాల్సిందే..
కథ : ఆర్. విజయకుమార్ అలియాస్ విజ్జు (సుధీర్ బాబు) కు సినిమాలంటే ఇష్టం ఉండదు. బొమ్మలతో చిన్న పిల్లల కథల పుస్తకం రచిస్తుంటాడు. అయితే అతని తండ్రి సర్వేష్ ( సీనియర్ నరేష్) కి మూవీలంటే చాలా ఇష్టం. వాటిమీద ఆసక్తితో తన ఇంటిని ఓ సినిమా షూటింగ్ కోసం అనుమతిస్తాడు. అయితే అందులో నటించేందుకు తనకూ ఛాన్స్ ఇవ్వాలని కోరుతాడు. ' కుమ్మేస్తా ' అనే కామెడీ చిత్రం యూనిట్ ఇందుకు సరేనంటుంది.ఈ చిత్రం షూటింగ్ సందర్భంగా హీరోయిన్ సమీర రాథోడ్ (అదితి రావ్ హైదరీ) తో విజ్జు లవ్ లో పడతాడు. ఆమెకు తెలుగు సరిగా రాకపోవడంతో తానే ఆమెకు నేర్పించే ప్రయత్నం చేస్తాడు. షూటింగ్ తరువాత సమీర కులూ మనాలీ వెళ్ళిపోతుంది. ఆమెను మరిచిపోలేని విజ్జు అక్కడికి వెళ్లి తన ప్రేమను వ్యక్తపరిచినప్పటికీ సమీర నిరాకరిస్తుంది. అయితే చివరకు ఏం జరుగుతుంది ? అతని ప్రేమను ఆమె అంగీకరిస్తుందా ? ఇద్దరూ ఒక్కటవుతారా ? వీరి ప్రేమ చివరకు ఏ మలుపు తిరిగి శుభం కార్డు పడుతుంది అన్న విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
విజ్జు రోల్ లో సుధీర్ బాబు ఒదిగిపోయాడు.లవర్ బాయ్ గా బాగా నటించాడు. తెలుగు రాని నటిగా అదితిరావ్ హైదరీ నటనకు మంచి మార్కులే పడతాయి. సీనియర్ నరేష్ కామెడీ పండింది. హీరో తండ్రి పాత్రలో మంచి నటన కనబరిచాడు. లీడ్ ఆర్టిస్టుల నటన, వివేక్ సాగర్ సంగీతం, డైలాగులు ఈ సినిమాకు ప్లస్ పాయింట్లు కాగా.. అక్కడక్కడ నెమ్మదిగా సాగిన కథనం మైనస్ పాయింట్ అయింది. ఎడిటింగ్ లో కాస్త శ్రద్ధ చూపాల్సింది. ఇంద్రగంటిమోహనకృష్ణ ఒక చక్కని కథను ఎంపిక చేసుకుని, హీరో హీరోయిన్లను బాగా హైలైట్ చేయగలిగాడు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







