యూఏఈ పెడెస్ట్రియన్‌ బ్రిడ్జిపై వ్యక్తి ఆత్మహత్య

- June 17, 2018 , by Maagulf
యూఏఈ పెడెస్ట్రియన్‌ బ్రిడ్జిపై వ్యక్తి ఆత్మహత్య

అబుదాబీ:అబుదాబీలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షేక్‌ రషీద్‌ బిన్‌ సయీద్‌ అల్‌ మక్తౌమ్‌ ఫుట్‌ బ్రిడ్జిపై ఉరేసుకున్నాడు ఓ వ్యక్తి. అతన్ని ఆసియా జాతీయుడిగా గుర్తించారు. సమాచారం అందుకోగానే, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, విచారణ ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఉదయం 11.19 నిమిషాల సమయంలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కి ఈ ఆత్మహత్య ఘటనపై సమాచారం అందింది. ఎయిర్‌ పోర్ట్‌ రోడ్‌లోని ఫుట్‌ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com