నేరారోపణ పై ఇద్దరు అరెస్ట్

- December 10, 2015 , by Maagulf
నేరారోపణ పై  ఇద్దరు  అరెస్ట్
 విలైట్ వాణిజ్య ప్రాంతంలోని   జలాన్ బాని బు అలీ  స్థానిక దుకాణంలో అనుమానంగా సంచరిస్తున్న 
   ఇరువురు వ్యక్తులను  నేర పరిశోధనాధీకారులు అరెస్ట్ చేసారు. ఈ సమాచారాన్ని రాయల్ ఒమన్ 
   పోలీస్ విభాగానికి చెందిన ఒక అధికారి తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తి గత వారం రాత్రి సమయంలో 
   దొంగతనం  చేసేందుకు ఆ దుకాణంను ద్వంసం చేశాడు.  ఇదే సమయంలో గస్తి తిరుగుతూ ఉన్న 
   పోలిసుల కంటబడ్డాడు. దీంతో అనుమానితుడిని అదుపులోనికి తీసుకొని అరెస్ట్ చేసినట్లు వారు 
  తెలిపారు. తమ విచారణలో ఆ వ్యక్తి దుకాణానికి చెందిన షట్టర్ ను పగలకొట్టి లోనికి ప్రవేశించి, కొన్ని 
  విలువైన వస్తువులను అపహరించినట్లు  ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. 
              అలాగే , మూడు నేరాలతో సంబంధం ఉన్న మరో నిందితుడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో ఒక దుకాణంలో దొంగతనం చేశాడని, అలాగే పారిశ్రామిక ప్రాంతంలోని ఒక కార్మిక శిభిరం లోనికి ప్రవేశించి అత్యధిక మొత్తంలో డబ్బును , ఒక  సెల్ ఫోన్ ను  అపహరించినట్లు చెప్పారు. ఈ దొంగ తన మూడవ నేరంగా ఒక  స్టోరే లో  దొంగతనం చేయడమే కాక సెక్యూరిటీ కెమెరాలను ద్వంసెం చేసినట్లు ఆ వ్యక్తిపై నేరారోపణ నమోదు కాబడింది. 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com