మిస్ ఇండియా కిరీటం అందుకున్న తమిళ పొన్ను

- June 19, 2018 , by Maagulf
మిస్ ఇండియా కిరీటం అందుకున్న తమిళ పొన్ను

మిస్ ఇండియా కిరీటం అందుకోవాలనే తపన నేటితరం అమ్మాయిలలో ఎంతగానో ఉంది. దేశవ్యాప్తంగా ఈ కిరీటం దక్కించుకునేందుకు విపరీతమైన పోటి నెలకొంది. గత రాత్రి ముంబై డోమ్‌లోని ఎన్ఎస్‌సీఐ ఎస్‌వీపీ స్టేడియంలో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో 30 మంది ఫైనలిస్ట్‌లు పాల్గొనగా, తమిళనాడుకి చెందిన 19 ఏళ్ల అనుకృతి వాస్ మిస్ ఇండియా కిరీటం గెలుచుకుంది. గతేడాది 'మిస్‌ వరల్డ్‌'గా ఎన్నికైన మానుషి చిల్లర్‌, అనుకృతికి కిరీటం ధరింపచేసింది. ఇక మొదటి రన్నరప్‌గా హరియానా కు చెందిన మీనాక్షి చౌదరీ నిలవగా...రెండో రన్నరప్‌గా ఆంధ్రపదేశ్‌కు చెందిన శ్రేయా రావ్‌ కామవరపు నిలిచింది.


ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ పోటికి వ్యాఖ్యాతగా బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహర్‌, ఆయుష్మాన్ ఖురానా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. బాలీవుడ్ బ్యూటీస్ మాధురీ దీక్షిత్‌, కరీనా కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. ఇక క్రికెటర్స్ ఇర్ఫాన్ పఠాన్, కేఎల్ రాహుల్ మరియు బాలీవుడ్ స్టార్స్ మలైకా అరోరా, బాబి డియోల్‌, కృనాల్ కపూర్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. 'మాజీ మిస్‌ వరల్డ్‌' స్టెఫానియే డెల్‌ వాలి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. న్యాయ నిర్ణాతల ప్యానెల్‌లో మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్‌తో పాటు మిస్ యునైటెడ్ కాంటినెంట్ 2017 సనా డ్యుయా, మిస్ ఇంటర్‌కాంటినెంటల్ 2017 ప్రియాంక కుమారీలు ఉండగా, వీరు గెలిచిన వారికి క్రోన్స్ ధరింపంజేశారు.అనుకృతి వాస్‌ 'మిస్‌ వరల్డ్‌ - 2018' కోసం సిద్ధమవుతుండగా, రన్నరప్‌గా నిలిచిన ఇద్దరు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018, మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ 2018 కోసం రెడీ అవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com