పలు వాహనాలకు పర్మిట్‌ ఫీజుని రద్దు చేసిన యూఏఈ

- June 20, 2018 , by Maagulf
పలు వాహనాలకు పర్మిట్‌ ఫీజుని రద్దు చేసిన యూఏఈ

యూఏఈ క్యాబినెట్‌, హెవీ వెహికిల్స్‌కి నిర్దేశించిన ఒకరోజు పర్మిట్‌ పీజుని రద్దు చేసింది. దేశంలోని పలు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టులకు సంబంధించి రవాణా వెసులుబాటు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్బన్‌ మరియు ఎకనమిక్‌ సెక్టార్స్‌కి సంబంధించిన గ్రోత్‌ని దృష్టిలో పెట్టుకుని షిప్పింగ్‌ మరియు ట్రాన్స్‌పోర్టేషన్‌ రంగాలకు మేలు చేసేలా ఈ నిర్ణయం వుంటుంది. ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యే దిశగా ఈ నిర్ణయం ఉపయోగపడ్తుందని పలువురు అభిప్రాయపడ్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో 5 శాతం వరకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బడ్జెట్స్‌ ఇతర మార్గాల వైపు మళ్ళించడానికి అవకాశం వుంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com