డిఆర్‌డిఒలో ఉద్యోగ అవకాశాలు
- June 21, 2018
ఢిల్లీలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవల్‌పమెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్మెంట్ & అసె్‌సమెంట్ సెంటర్ (ఆర్ఏసీ) - నేరుగా బీ గ్రేడ్ సైంటిస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగం: మెకానికల్
అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బిఈ / బీటెక్ (మెకానికల్ / మెకట్రానిక్స్ / మెకానికల్ & ఆటొమేషన్ / మెకానికల్ & ప్రొడక్షన్) ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరు సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశీ డిగ్రీలు చేసిన అభ్యర్థులూ అర్హులే. అయితే వీరు 'అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్' నుంచి 'ఈక్వీవేలెన్స్ సర్టిఫికెట్'ను సమర్పించాలి. అభ్యర్థులందరూ జూలై 31 నాటికి సంబంధిత సర్టిఫికెట్లు పొంది ఉండాలి. వ్యాలిడ్ గేట్ స్కోరు తప్పనిసరి.
వయసు: దరఖాస్తు నాటికి జనరల్ అభ్యర్థులకు 28 ఏళ్లు, ఓబీసీలకు 31 ఏళ్లు, ఎస్సీ & ఎస్టీలకు 33 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: అభ్యర్థులను గేట్ స్కోరు ఆధారంగా 1:25 నిష్పత్తిలో రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. రాత పరీక్షలో అర్హత పొందినవారిని 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పిలుస్తారు.
రాత పరీక్ష వివరాలు: పరీక్ష పూర్తిగా సబ్జెక్టివ్ పరంగా ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కోదానికి 300 మార్కులు కేటాయించారు. అలాగే ఒక్కో పేపర్‌కు 3 గంటల పరీక్ష సమయం ఉంటుంది.
పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కాన్పూర్, కోల్‌కతా, పుణె
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్ 30
వెబ్సైట్: https://rac.gov.in
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







