ఫేక్‌ బిజినెస్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌: వ్యక్తికి జైలు, జరీమానా

- June 21, 2018 , by Maagulf
ఫేక్‌ బిజినెస్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌: వ్యక్తికి జైలు, జరీమానా

మస్కట్‌:ఫేక్‌ బిజినెస్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ అభియోగాల నేపథ్యంలో ఓ వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, 550 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా విధించడం జరిగింది. కన్స్యూమర్‌ వాచ్‌ డాగ్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ (పిఎసిపి) వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు, ఓ వెబ్‌సైట్‌లో ఫేక్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌ని పొందుపరిచాడు. ఈ అడ్వర్టయిజ్‌మెంట్‌లో, ఫిలిప్పినో డొమెస్టిక్‌ వర్కర్స్‌కి సహాయం చేస్తానని పేర్కొనడం జరిగింది. ఈ ప్రకటన చూసి 1,200 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించిన ఓ వ్యక్తి, ఎంతకాలమైనా తనకు కోరుకున్న ఉద్యోగం రాకపోవడంతో కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బురైమీ)ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించగా, న్యాయస్థానం నిందితుడికి జైలు శిక్ష, జరీమానాతోపాటుగా, బాధితుడికి 1,350 ఒమన్‌ రియాల్స్‌ చెల్లించాల్సిందిగా ఆదేశించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com