ఆసక్తిని రేకెత్తిస్తున్న నిత్యామేనన్‌ లుక్‌

- June 24, 2018 , by Maagulf
ఆసక్తిని రేకెత్తిస్తున్న నిత్యామేనన్‌ లుక్‌

 విభిన్న కథలతో వెండితెరపై సందడి చేసి, ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ముద్దుగుమ్మ నిత్యా మేనన్‌. స్క్రిప్ట్‌కు, పాత్రకు ఆమె చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే వైవిధ్యమైన కథలతో ప్రయోగాలు చేస్తుంటారు. ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ప్రాణ'. వీకే ప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ రాజ్‌, ప్రవీణ్‌ ఎస్‌ కుమార్‌, అనిత రాజ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ విడుదల చేశారు. 'వీకేపీకు, నిత్యకు అభినందనలు. ఈ ప్రాజెక్టు నిజంగా సాహసంతో కూడిన ప్రయత్నమని చెప్పొచ్చు. ఇందులో నాదీ ఓ చిన్న పాత్ర ఉంది. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌' అని దుల్కర్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ పోస్టర్‌ను నిత్య షేర్‌ చేశారు. ఈ తొలి ప్రచార చిత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. కేవలం నిత్య ముఖాన్ని చూపించారు.

ఆమె చుట్టూ వలయాకారంలో చిన్నారి ముఖాలు ఉన్నాయి. చాలా విభిన్నంగా ఈ ఫస్ట్‌లుక్‌ కనిపించింది. 'ప్రాణ' సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. ఇటీవల షూటింగ్‌ పూర్తైంది.

ఈ సినిమాలో తెరపై కేవలం నిత్యనే కనిపిస్తారట. గత ఏడాది ఆమె 'అదిరింది'తో మంచి హిట్‌ అందుకున్నారు. ఈ ఏడాది 'ఆ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆమె ఓ మలయాళ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com