ఇంటర్నేషనల్ యోగా డే లో పాల్గొన్న 500 మంది
- June 24, 2018
మస్కట్: ఇండియన్ ఎంబసీ, మస్కట్‌లో నిర్వహించిన గ్రాండ్ యోగా సెషన్‌లో 5000 మందికి పైగా ఔత్సాహికులు పల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఈ ఈవెంట్‌ని నిర్వహఙంచారు. ఈ యోగా వేడుకలో ఇండియన్స్, ఇతర వలసదారులు, డిప్లమాటిక్ కార్ప్స్, స్టూడెంట్స్, పౌరులు పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఈ ఈవెంట్ జరిగింది. 80 ఏళ్ళ వయసు దాటినవారూ, చిన్న పిల్లలు సైతం ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గమనార్హం. ఒమన్ ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండియన్ సోషల్ క్లబ్ ఒమన్, అలాగే ఆ సంస్థకు చెందిన 27 లింగ్విస్టిక్ వింగ్స్, ఇండియన్ స్కూల్స్ మస్కట్, 16 యోగా ఆర్గనైజేషన్స్ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా యోగా మ్యాట్స్, టీ షర్ట్‌లను ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ కొన్ని అందించాయి. 2015 నుంచి ఇండియన్ ఎంబసీ ఈ ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్ని నిర్వహిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







