బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ ట్రాఫిక్ 9 శాతం పెరుగుదల
- June 25, 2018
బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (బహ్రెయిన్), ఈద్ అల్ ఫితర్ సందర్భంగా 9 శాతం అదనంగా ట్రాఫిక్ నమోదు చేసింది. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్ కంపెనీ (బిఎసి) ఈ విషయాన్ని వెల్లడించింది. ఈద్ పీరియడ్‌లో 142,725 మంది ప్రయాణీకులు బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణించారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఈసారి 9 శాతం అదనం. విమానాల సంఖ్య పరంగా చూస్తే 8 శాతం అదనం. చీఫ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ఆఫీసర్ మిఖాయిల్ హోహోన్బర్గర్ మాట్లాడుతూ, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్మూత్‌గా, సమర్థవంతంగా ప్రయాణీకుల్ని ఈద్ సందర్భంగా డీల్ చేసిందని చెప్పారు. పెద్దయెత్తున ప్రయాణాలు జరిగినప్పుడూ సిబ్బంది సమర్థవంతంగా డీల్ చేయగలరన్న విషయం ఇంకోసారి ప్రూవ్ అయ్యిందని ఆయన వివరించారు. కొత్త టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభమైతే 14 మిలియన్ ప్యాసింజర్లను (ఏడాదికి) హ్యాండిల్ చేసే సామర్థ్యం లభిస్తుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..