జులై 7న సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఆడియో రిలీజ్ వేడుక

- June 29, 2018 , by Maagulf
జులై 7న సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఆడియో రిలీజ్ వేడుక

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం సాక్ష్యం. అభిషేక్‌ నామా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. టీజర్‌ ఇటీవలే విడుదల చేశారు. ఈ క్రేజీ యాక్షన్‌ చిత్రాన్ని జులై 20వ తేదిన విడుదల చేయనున్నారు.ఈ నేపథ్యంలో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను హైదరాబాద్ లో జులై 7వ తేదిన నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు..
ఇతర పాత్రల్లో జగపతిబాబు, శరత్‌కుమార్‌, మీనా, జయప్రకాష్‌, పవిత్ర లోకేష్‌, బ్రహ్మాజీ, లావణ్య తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం ఆర్థర్‌ ఎ.విల్సన్‌, మాటలు సాయిమాధవ్‌ బుర్రా, సంగీతం హర్షవర్థన్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com