తిండి దొరకని దేశం... మట్టి రొట్టెలు తింటూ కడుపునింపుకుంటున్న..

- June 30, 2018 , by Maagulf
తిండి దొరకని దేశం... మట్టి రొట్టెలు తింటూ కడుపునింపుకుంటున్న..

ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనవి పేదరికం, ఆర్థిక అసమానతలు. ఈ రెండు సమస్యలు ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగినవి. ఒక సమస్య మరో సమస్యను స‌ృష్టిస్తూ సమస్యల  తీవ్రతను పేంచుతూనే  ఉన్నాయి. నాసా అంతరిక్షంలో భూమికి  ప్రత్యామ్నాయంగా సకల సౌకర్యాలు  ఉన్న మరో గ్రహం కొసం వెతుకుతుంటే మట్టితో చేసిన రొట్టెలను తినే దుర్భుర పేదరికాన్ని అనుభవిస్తోంది ఓ దేశం. ఆఫ్రికాలోని హైతీ దేశంలో పేద ప్రజలు మెత్తటి మట్టితో చేసిన రొట్టెలను తింటూ జీవనం సాగిస్తున్నారు. హైతి ప్రజల దీన స్థితికి సంబంధించిన  ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. అయితే  ఈ వీడియోపై  ప్రముఖ క్రికేటర్  వీరేందర్‌ సెహ్వాగ్‌ స్సందించారు. ఈ వీడియోను తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్  చేస్తూ "అన్నం  ఎంత  విలువైందో ఇలాంటి  ప్రజల ధిన స్థితిని చూసి అయిన  తెలుసుకోవాలి.  దరిద్రావస్థలో మట్టి పెంకులు తింటూ కడుపునింపుకుంటున్న వారిని చూసి మీరు  వృథాచేసే తిండి ఎంత ముఖ్యమైందో తేలుసుకోవాలి.  వృథాచేసిన  ఆహారాన్ని ఇకనైన  సమీపంలోని రోటీ బ్యాంకులకు అందజేయండి’ అంటూ సందేశాన్ని ఇచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com