ఈ నగరానికి ఏమైంది:రివ్యూ

- June 30, 2018 , by Maagulf
ఈ నగరానికి ఏమైంది:రివ్యూ

విడుదల తేదీ : జూన్ 29, 2018

నటీనటులు : విశ్వక్ సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్, సిమ్రన్ చౌదరి

దర్శకత్వం : తరుణ్ భాస్కర్

నిర్మాత : డి.సురేష్ బాబు

సంగీతం : వివేక్ సాగర్

సినిమాటోగ్రఫర్ : నికేత్ బొమ్మి

ఎడిటర్ : రవి తేజ గిరిజాల

స్క్రీన్ ప్లే : తరుణ్ భాస్కర్


పెళ్ళి చూపులతో తెలుగు పరిశ్రమను తనవైపుకు తిప్పుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. తరువాత ఏం చేస్తాడనే ప్రశ్నలు జవాబుగా ఒక గ్యాంగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మరి గ్యాంగ్ చేసిన ఎంటర్ టైన్మెంట్ ఏంటో చూద్దాం...

కథ:

వివేక్ (విశ్వక్ సేన్ నాయుడు), కార్తిక్ (సుశాంత్ రెడ్డి), కౌశిక్ (అభినవ్ గోమఠం), ఉపేంద్ర (వెంకటేష్ కాకుమాను)లు నలుగురు చిన్నతనం నుండి మంచి స్నేహితులు. కానీ వారందరూ ఎప్పుడూ ఏదో గొడవలు పడుతుంటారు.  వివేక్ షార్ట్ ఫిల్మ్ లు చేసి దర్శకుడిగా సక్సెస్ అవ్వాలని ట్రై చేస్తుంటాడు. కార్తీక్ ఒక పబ్ లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు. కార్తీక్ సిన్సియారిటీకి మెచ్చి పబ్ ఓనర్ తన కూతుర్ని కార్తీక్‌కి ఇచ్చి పెళ్ళి చేద్దామనుకుంటాడు. ఏంగేజ్ మెంట్ దగ్గర పడుతున్న టైం లో ఒక రోజు సరదాగా తాగి మత్తులో గోవాకు చేరతారు ఫ్రెండ్స్.  పదిలక్షల విలువైన కార్తీక్ వెడ్డింగ్ రింగ్ ఆ ప్రయాణంలో మిస్ అవుతుంది. సో.. కార్తీక్ వెడ్డింగ్ రింగ్ సంపాదించాలంటే అక్కడ జరిగే షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ని గెలవడం తప్ప మరో దారి కనిపించదు గ్యాంగ్ కి..మరి గ్యాంగ్ ఏం చేసింది. కార్తీక్ పెళ్ళి జరిగిందా లేదా..? వివేక్ దర్శకుడు అయ్యాడా లేదా అనేది మిగిలిన కథ..?

కథనం:
సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కి ఫార్మెట్ లు మారుతున్నాయి. ఇలానే సినిమాలుండాలి.. ఇలానే డైలాగ్స్ ఉండాలి అనే నియమాలను దాటి కొత్త ఎక్స్ పీరియన్స్ లు అందించేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. అలాంటి  సినిమాల కోవలోకే ‘ ఈ నగరానికి ఏమైంది’ చేరుతుంది. నలుగురు ప్రెండ్స్ ఎలా ఉంటారో అనే మెటిరియల్ ని సినిమా కి కథగా మలచడం అంత తేలికైన పనికాదు. ఆ పనిని చాలా సునాయసంగా చేసి విజయం సాధించాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. వెళ్లిపోమాకే తో పరిచయం అయిన విశ్వక్ సేన్ టెంపర్ ని కంట్రోల్ చేసుకోలేని కుర్రాడు గా బాగా నటించాడు. ఇక ప్రెండ్స్ పాత్రలలో కనిపించిన వారిలో సుశాంత్, కౌశిక్ నటనలో  మంచి మార్కులు స్కోర్ చేసారు. తరుణ్ భాస్కర్ రైటింగ్ ఈ జనరేషన్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ కి లవ్ ప్రపోజ్ చేసే సీన్ ఒక్కటి చాలు అతను యూత్ కి ఎంత దగ్గరగా ఉన్నాడో చెప్పడానికి. ఈ మద్య కాలంలో  తెరమీద చూసిన అందమైన లవ్ ప్రపోజల్ సీన్ ఇదే అనుకోవచ్చు. లవ్ బ్రేక్ అప్ సీన్ కూడా అలాంటి రిఫరెన్స్ గానే మిగిలిపోతుంది. తరుణ్ తెలుగు సినిమా రైటింగ్ విధానంలో మార్పులు తెచ్చాడు.  నలుగురు ప్రెండ్స్ దారులు వేరైనా వారి కలల గమ్యం ఒక్కటే. కానీ బతకడం, జీవించడానికి మద్య తేడాను తేలికైన  సన్నివేశాల్లోచూపించాడు దర్శకుడు. నలుగురు ప్రెండ్స్ కథ అంటే నలుగురు ఫ్రెండ్స్ కదే.. కొలతలో ఒకరి కథ ఎక్కువ ఉండొచ్చు.. తక్కువ ఉండొచ్చు.. కానీ వారు తెరమీద ప్రెండ్స్ లాగే ఉన్నారు. మద్యలో ఏ ప్రెండ్ కూడా హీరోలా టర్న్ అవలేదు. అదే తరుణ్ భాస్కర్ రైటింగ్ లో కూడా అదే సహాజత్వం కనిపించింది. తను దర్శకుడు కావాడానికి చేసిన ప్రయాణం లో నుండి వచ్చిన కథే ఇది అనుకునే విధంగా ఉంది ఈ సినిమా కథ. కథ పరంగా డ్యూయెట్స్ కి ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఛాన్స్ తీసుకోలేదు. వివేక్ సాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నికేత్  సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొదలైన పదినిముషాలకు ఈ గ్యాంగ్ లో ప్రేక్షకులు  కలసిపోతే సినిమా అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏంటీ గ్యాంగ్ అనే సందేహాలు మనసులోకి వస్తే మాత్రం గ్యాంగ్ వేరు మీరు వేరు అయిపోతారు. వెళ్లిపోమాకే లో చూసి విశ్వక్ కి ఇందులో చాలా వ్యత్యాసం కనిపించింది. పూర్తి బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఇక ప్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన వారిలో సెంకడాప్ లో కౌశిక్ బాగా స్కోర్ చేసాడు. అతని కామెడీ టైమింగ్ చాలా బాగుంది. వీరి గొడవలు.. ఎమోషన్స్ .. జీవితంలో వీరికి కావాల్సిందేంటో తెలుసుకునే ప్రయాణం పూర్తిగా నవ్వులతో నిండిపోయింది.

చివరిగా:
సరదా గ్యాంగ్ తో ఫన్ రైడ్ చేయాలంటే మీ ప్రెండ్స్ గ్యాంగ్ తో వెళ్ళండి...

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com