దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య
- July 01, 2018
దిల్లీలో దారుణం ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ఆదివారం తెల్లవారుజామున దారుణం చోటుచేసుకుంది. ఉత్తర దిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆదివారం ఓ ఇంట్లో 11 మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. మృతదేహాల కళ్లకు గంతలు, కాళ్లు చేతులు కట్టేసి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం..వారు ఫర్నీచర్ వ్యాపారం చేసేవారట. రోజూ ఉదయం 6 గంటలకు షాప్ తెరిచేవారు, ఈరోజు 7.30 అయినా తెరవకపోవడంతో అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లిచూశామని 11 మంది ఉరేసుకున్నట్లు కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఆర్థిక సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా? లేదా పాత కక్షలతో ఎవరైనా చంపి ఉరి తీశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు వెల్లడించారు. ఒకేసారి 11 మంది మృతదేహాలు లభ్యమయ్యేటప్పటికి చుట్టు పక్కలవారు భయబ్రాంతులకు గురవుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







