ట్రూకాలర్ ప్రో సబ్‌స్క్రయిబర్స్ కోసం స్పెషల్ ఆఫర్
- July 02, 2018
స్మార్ట్ ఫోన్ యూజర్ల ఫేవరట్ గా నిలిచిన ట్రూకాలర్, ఇప్పుడు తన ప్రో సబ్ స్క్రయిబర్స్ కోసం సరికొత్త సర్వీసును అందిస్తోంది. ముఖ్యంగా తన ప్రో సబ్‌స్క్రయిబర్స్ కోసం " హూ వ్యూడ్ యువర్ ప్రొఫైల్ " పేరిట సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది. దీని ద్వారా ట్రూకాలర్ ద్వారా మీ ప్రొఫైల్ ఎవరు పరిశీలించారో ఇట్టే తెలుసుకోవచ్చు. తద్వారా మీకు ఎవరి నుంచి కాల్ రానుందో ముందే తెలుసుకునే అవకాశం ఉంది.
ఇది ఎలా పనిచేస్తుంది...ట్రూ కాలర్ ప్రో యూజర్స్ కు ముందుగా ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైన మీ కాంటాక్ట్ ప్రొఫైల్ ను చెక్ చేసినా, లేదా కాల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాంటాక్ట్ పర్సన్ యాప్ తో షేర్ చేసుకున్న డీటైల్స్‌ని బట్టి మీరు పొందే అవకాశం ఉంది. అలాగే నోటిఫికేషన్ ద్వారా మాత్రమే కాదు సెట్టింగ్స్ లోని ప్రైవసీ సెంటర్ లోకి వెళ్లి కూడా మీ ప్రొఫైల్ లో ఎవరు తొంగి చూస్తున్నారో పరిశీలించవచ్చు.
ప్రైవేట్ మోడ్..
ప్రో యూజర్లకు మరో అవకాశం ఉంది. ప్రైవేట్ మోడ్ ద్వారా మీరు ఒక వేళ వేరే వ్యక్తి ప్రొఫైల్ ను చూసినట్లయితే మీ డిటైల్స్ ను షేర్ చేయకుండా ఉండటం కూడా ప్రైవేట్ మోడ్ ద్వారా ప్రో యూజర్లకు అందిస్తున్నారు.త్వరలో విడుదల కానున్న ఈ ఫీచర్ ద్వారా ప్రోయూజర్ల సంఖ్య పెంచుకునే దిశలో ట్రూకాలర్ పనిచేస్తుంది. ప్రో ఫీచర్ ను ఇకపై ప్రీమియం ఫీచర్ గా పిలువనున్నారు. ప్రో ఫీచర్ లో మరింత సెక్యూర్ గానూ, సేఫ్టీతోనూ ఫీచర్లను అందిస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే కంపెనీ నుంచి మల్టీ బ్యాంక్ పేమెంట్స్ యాప్ సర్వీసులు కూడా ప్రారంభం అయ్యాయి. చిల్లర్ పేరిట ఉన్న యాప్ ను ఈ మధ్య కాలంలోనే కొనుగోలు చేశారు.ట్రూకాలర్ పే 2017లో లాంచ్ అయినప్పటి నుంచి యూజర్ల సంఖ్య క్రమంగా పెరిగినట్లు కంపెనీ సీఎస్ఓ నామి జరిగలం తెలిపారు. బెంగుళూరులో కంపెనీ డెవలప్ మెంట్ సెంటర్ లో మరిన్ని మార్పులతో ట్రూకాలర్ రూపుదిద్దుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్