సోషల్‌మీడియా వాడాలంటే ఇకపై అంత చెల్లించాల్సిందే..

- July 02, 2018 , by Maagulf
సోషల్‌మీడియా వాడాలంటే ఇకపై అంత చెల్లించాల్సిందే..
ఉగాండాలో జులై 1 నుంచి ఈ పన్ను విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. యూజర్లు సోషల్‌మీడియా యాప్‌లను వినియోగించుకోవాలంటే రోజుకు 200షిల్లింగ్‌లు అంటే మన కరెన్సీలో దాదాపు 3 రూపాయల50 పైసలు  పన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. మొబైల్‌ మనీ ద్వారా ఈ డబ్బు చెల్లించిన తర్వాతే సోషల్‌మీడియా యాప్‌లకు యాక్సెసింగ్‌ వస్తుంది. సోషల్‌ మీడియా వినియోగంపై పన్నును ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో టెలికాం సంస్థలు జులై 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి.
 
సోషల్‌మీడియా వినియోగంపై పన్నును విధించాలని ఉగాండా అధ్యక్షుడు ముసెవెనీ ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఈ మేరకు రోజుకు 200 షిల్లింగ్‌ల చొప్పును పన్ను విధించాలని ఆర్థికశాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశిస్తూ అప్పట్లో లేఖ కూడా రాశారు. అయితే విద్యాపరమైన అవసరాల కోసం సోషల్‌మీడియాను ఉపయోగించుకునే వారికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు కల్పించాలని సూచించారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ఉగాండా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ప్రభుత్వం ఆదాయంగా మలుచుకొంటోందని విమర్శిస్తున్నారు.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com