కారులో కంత్రీలు.. టిక్‌టాక్‌గా వస్తారు..ఎవరికీ ఏ మాత్రం..
- July 02, 2018
పగలు రెక్కీ... రాత్రి దొంగతనం. నిన్న మొన్నటి దాకా ఇదీ దొంగల తీరు. కానీ దొంగలు రూటు మార్చారు. రెక్కీ, దోపిడీ అన్నీ ఒకేసారి ముగించేస్తున్నారు. తాళం వేసివున్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్నారు. పట్టపగలే దర్జాగా దోచేస్తున్నారు. మూడు రోజుల్లో ఎనిమిది ఇళ్లను గుల్ల చేశారు. సిటీ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కంత్రీలు... పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
పట్టపగలు దొంగల దర్జాగా కారులో వస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. అదనుచూసి ఇంట్లోకి దూరిపోతారు....
టిక్‌టాక్‌గా వస్తారు. ఎవరికీ ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తపడతారు. ఈ కంత్రీలు కారులో వస్తారు. దీంతో ఎవరికీ వీళ్లపై డౌట్ రాదు. ఇంటి యజమానులే అనుకుంటారు. కానీ వీళ్లు మాత్రం గోడదూకి ఇంట్లోకి వెళ్తారు. డూప్లికేట్ కీస్‌తో తాళం తీసి ఉన్నదంతా దోచేస్తారు....
ఇలాంటి దొంగతనాలు హైదరాబాద్ సిటీలో ఈ మధ్య ఎక్కువయ్యాయి. మూడు రోజుల్లోనే ఎనిమిది దొంగతనాలు జరగడం నగర వాసులను భయపెడుతోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఇదంతా ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సీసీ టీవీ కెమెరాలు వీళ్ల ప్రతి కదలికను కనిపెడుతూనే ఉన్నాయి....ఐదుగురు సభ్యులున్న ఈ ముఠా... చోరీలు చేయడంలో దిట్ట. చాలా స్టైలిష్‌గా ఉండే ఈ ముఠా సభ్యుల మెడలో బ్యాగు ఉంటుంది. తాళాలు తెరిచే వస్తువులన్నీ అందులో రెడీగా ఉంటాయి. యాక్షన్ మొదలు పెట్టి మూడు నిమిషాల్లోనే దోచేయడం ఈ ముఠా ప్రత్యేకత. పనిపూర్తికాగానే అక్కడి నుంచి చల్లగా కారులో జారుకుంటారు. గూగుల్ మ్యాప్స్ ఆధారంగా హైవే పైకి వెళ్లి పారిపోతారు. ఈ ముఠాకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కంత్రీల కోసం గాలిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







