వైఎస్ఆర్ బయోపిక్ 'యాత్ర' టీజర్ విడుదల తేదీ ఖరారు!
- July 04, 2018
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా యాత్ర చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఎన్టీఆర్ బయోపిక్ కు రంగం సిద్ధం అవుతుండడం, మరో వైపు వైఎస్ఆర్ బయో పిక్ వస్తుండడంతో సినీ రాజకీయా వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. ఇటీవల కేసీఆర్ బయోపిక్ చిత్రం కూడా ప్రారంభం అయింది.
ఇదిలా ఉండగా యాత్ర చిత్రాన్ని కేవలం ఒకే షెడ్యూల్ లో పూర్తి చేయనున్నారు. వైఎస్ ఆర్ జయంతి జులై 8 న యాత్ర చిత్ర టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. జగపతి బాబు, రావు రమేష్, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. వైఎస్ఆర్ జీవితంలో చోటు చేసుకున్న కెలక ఘట్టాలు, ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనం తదితర అంశాలు ఈ చిత్రంలో చూపించబోతున్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







