ఎన్టీఆర్ సతీమణి పాత్రలో ఆమే!
- July 05, 2018
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా బయోపిక్ రాబోతున్న సంగతి తెలిసిందే. క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు 'యన్‌టిఆర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీల్ లైఫ్ ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఏ పాత్రల్లో నటించబోతున్నారు? అన్న ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఫిక్స్ అయిపోయారు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మరోపక్క సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నాగచైతన్య, రానా, శర్వానంద్‌ల పేర్లు కూడా వినపడుతున్నాయి. అలనాటి నటి సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కి వీరాభిమాని అయిన మోహన్‌బాబు కూడా 'యన్‌టిఆర్'లో కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.ప్రముఖ నటుడు రాజశేఖర్‌కీ ఓ పాత్ర దక్కిందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ, సాయి కొర్రపాటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాను హిందీలోనూ విడుదల చేయనున్నారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు.దీన్ని సెంటిమెంట్‌గా భావించి ఈ చిత్రాన్ని 2019 జనవరి 9న విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..