ట్రైలర్‌కి బదులు సినిమా అప్‌లోడ్‌ చేసేశారు

- July 05, 2018 , by Maagulf
ట్రైలర్‌కి బదులు సినిమా అప్‌లోడ్‌ చేసేశారు

ట్రైలర్‌కి బదులు సినిమా అప్‌లోడ్‌ చేసేశారు సోనీ పిక్చర్స్‌ సంస్థ తప్పిదం లాస్‌ఏంజెల్స్‌: ఎంతో కష్టపడి, కోట్లల్లో డబ్బు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తుంటారు. పైరసీ రాకాసుల బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పొరపాటున సినిమాలోని ఒక స్టిల్‌ లీకైనా లక్షల్లో నష్టపోతుంటారు. అలాంటిది సినిమా తీసిన నిర్మాణ సంస్థే పొరపాటున మొత్తం సినిమాను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్‌ తప్పిదం ఇది. జులై 3న సోనీ తమ యూట్యూబ్ ఛానల్‌లో 'రెడ్‌ బ్యాండ్‌' సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాల్సి ఉంది. కానీ ఈ సినిమా ట్రైలర్‌కు బదులు పొరపాటున 'ఖలి ది కిల్లర్‌' సినిమాను అప్‌లోడ్‌ చేసేసింది. ఈ తప్పిదాన్ని సీబీఆర్‌.కామ్‌ అనే వెబ్‌సైట్‌ గమనించి సమాచారం అందించింది. అప్పటికే ఆ సినిమా యూట్యూబ్‌లో ఎనిమిది గంటల పాటు లైవ్‌లో ఉంది. ఎందరో యూట్యూబ్‌ వినియోగదారులు సినిమాను వీక్షించేశారు కూడా. ఇక ఎటూ సినిమాను పొరపాటున అప్‌లోడ్‌ చేయడంతో చేసేదేం లేక ప్రేక్షకులకు ఈ చిత్రం రెంటల్‌ బేసిస్‌పై లభ్యమయ్యేలా సోనీ సంస్థ చర్యలు తీసుకుంది.

'ఖలి ది కిల్లర్' సినిమాకు జాన్‌ మాథ్యూస్‌ దర్శకత్వం వహించారు. రిచర్డ్‌ కాబ్రల్‌ ప్రధాన పాత్రలో నటించారు. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోపక్క ట్రైలర్‌ అప్‌లోడ్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కావాలనే ఈ తప్పిందం చేసినట్లు కనపడుతోందని అంటున్నారు. 'అసలు సినిమా నిడివి నాలుగు గంటలు ఇప్పుడు విడుదల చేసింది ట్రైలర్‌ మాత్రమే' అని ఇంకొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే ప్రచారంలో ఇది కూడా ఒక భాగమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వీడియో అప్‌లోడ్‌ చేసిన ఉద్యోగి పరిస్థితి ఏంటో? అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com