హూరాలో వలసదారుడి హత్య
- July 05, 2018
బహ్రెయిన్:భారతీయ వలసదారుడొకరు హూరాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో హత్య చేయబడ్డాడు. కేరళకు చెందిన అబ్దుల్ నహాస్, ఎగ్జిబిషన్ రోడ్‌లోని తన ఇంట్లో రక్తపు మడుగులో నిర్జీవంగా పడివుండడాన్ని గుర్తించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్గ్‌కి తరలించారు. పోలీస్ టీమ్, మృతుడి సమాచారం కోసం అక్కడి పరిసర ప్రాంతాలవారిని విచారించారు. ఫోరెన్సిక్ టీమ్ రంగంలోకి దిగి, కొన్ని ఆధారాల్ని సేకరించింది. నాలుగేళ్ళ క్రితం అబ్దుల్, బహ్రెయిన్‌కి వచ్చాడని పోలీసులు గుర్తించారు. అతనికి తల్లి రమ్లా, తలండ్రి, అబ్దుల్లా కుట్టీ, సోదరుడు అనాస్, సోదరి నజామ్మ ఉన్నారు. మృతుడి బంధువు సహీర్ మాట్లాడుతూ, ఈ ఘటన తమకు షాక్ లాంటిదని అన్నాడు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని సహీర్ కోరారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







