భారీ అగ్నిప్రమాదం భయబ్రాంతులకు గురైన స్థానికులు
- July 05, 2018
హైదరాబాద్‌లో అర్థరాత్రి అగ్నిప్రమాదం స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. కృష్ణనగర్‌లోని ఓ హార్డ్‌వేర్ షాప్‌లో ప్రమాదవశాత్తూ మంటలు అంటుకున్నాయి.. అర్థరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో ప్రమాదం సంభవించింది.. భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. షాప్‌లో పెయింట్ డబ్బాలు ఎక్కువగా ఉండటంతో క్షణాల్లో మంటలు షాపు మొత్తం వ్యాపించాయి.. షాపుపైన రెసిడెన్షియల్ ఫ్లోర్లకూ మంటలు వ్యాపించడంతో వారంతా ఉరుకులు పరుగులు పెట్టారు.. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.. అయితే, మంటల తీవ్రత అధికంగా ఉండటంతో అదుపులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది.. అగ్నిప్రమాదంతో కృష్ణనగర్ ఏరియాలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







