సౌదీలో ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే

- July 05, 2018 , by Maagulf
సౌదీలో ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే

సౌదీలో నిరుద్యోగం 12.9 శాతానికి చేరుకుంది. గత కొంత కాలంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పతనమవడంతో ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా సౌదీలో బడ్జెట్‌ లోటు ఏర్పడింది. ఈ లోటు పూడ్చడానికి 2018 ఆరంభం నుంచి ప్రైవేటు సంస్థల ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధించింది. దీనితో ఆయా సంస్థలు స్వదేశీయులకే అవకాశాలు కల్పిస్తున్నాయి. 1999 నుంచీ పరిశీలిస్తే ప్రస్తుతమున్న నిరుద్యోగ రేటు రికార్డు(12.9) స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే యావత్‌ దేశంలో విదేశీ ఉద్యోగుల సంఖ్య గత త్రైమాసికంతో పోలిస్తే 10.42 నుంచి 10.18 మిలియన్లకు తగ్గింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com