జనవరి 1 నుంచి 466,000 మందిని ఎట్రాక్ట్‌ చేసిన దుబాయ్‌ ఫ్రేమ్‌

- July 06, 2018 , by Maagulf
జనవరి 1 నుంచి 466,000 మందిని ఎట్రాక్ట్‌ చేసిన దుబాయ్‌ ఫ్రేమ్‌

దుబాయ్‌ ఫ్రేమ్‌కి జనవరి 1 నుంచి ఇప్పటిదాకా వచ్చిన విజిటర్స్‌ సంఖ్య 466,000కి పైగానే వుందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. బుధవారం ఈ ఎట్రాక్షన్‌ కోసం కొత్తగా ఇ-టికెటింగ్‌ సిస్టమ్‌ని లాంఛ్‌ చేశారు. విజిటర్స్‌ తమ విజిట్‌ వీసా ఆధారంగా దుబాయ్‌ ఫ్రేమ్‌ని తిలకించేందుకు డేట్‌, టైమ్‌ ఎంచుకోవచ్చని, స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ఇందుకు ఉపకరిస్తుందని అధికారులు వివరించారు. అవార్డ్‌ విన్నింగ్‌ ఆర్కిటెక్ట్‌ ఫెర్నాండో డోనిస్‌ డిజైన్‌ చేసిన ఈ స్ట్రక్చర్‌ ప్రపంచ వ్యాప్తంగా తక్కువ కాలంలోనే ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. జబెల్‌ పార్క్‌లో ఈ దుబాయ్‌ ఫ్రేమ్‌ని ఏర్పాటు చేశారు. లామినేటెడ్‌ గ్లాస్‌తో 2,900 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని నిర్మించారు. ఏడాదికి 2 మిలియన్‌పైగా విజిటర్స్‌ వస్తారని ముందుగా అంచనా వేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com