రెడ్‌వైన్ తాగుతున్నారా?
- July 07, 2018
రెడ్‌వైన్‌ను ఇష్టంగా తాగేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దానిని తాగడం పూర్తిగా మానేయడమే ఆరోగ్యానికి మంచిది. అధిక మోతాదులో రెడ్‌వైన్ తీసుకోవడం వలన క్యాన్సర్, హృద్రగంతో పాటు డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా శుద్ధిచేయని చక్కెర శాతం ఎక్కువగా ఉన్న ద్రాక్షారసం తాగడం వలన కాలేయం దెబ్బంతింటుంది.
ఈ పరిణామాల వలన శరీరంలోని చెడు కొవ్వు శాతం పెరుగుతుందని కూడా తెలియజేశారు. దీనిని తాగడం వలన దీర్ఘకాలిక వ్యాధులతో పాటు చర్మ సంబంధ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండడం వలన మెుటిములు కూడా ఏర్పడే అవకాశముంది.
చర్మం కళను కోల్పోతుందని డాక్టర్ ఇసాబెల్ షార్కర్ తెలిపారు. రెడ్‌వైన్ తాగడం వలన కళ్లకింద నల్లటి వలయాలు కూడా ఏర్పడే ప్రమాదముంది. మెుటిమలు చర్మంపై గల మృతుకణాల వలన రంధ్రాలు ఏర్పడుతాయి గనుక సాధ్యమైనంతవరకు రెడ్‌వైన్‌ను తాగకపోవడమే మంచిదని పరిశోధనలో తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







