తమకంటే చిన్నవాళ్ళని పెళ్ళి చేసుకున్న 24 మంది మహిళలు
- July 07, 2018
గత ఏడాది తమ కంటే తక్కువ వయసున్న యువకుల్ని 24 మంది మహిళలు పెళ్ళాడినట్లు నివేదికలు చెబుతున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ ఈ డేటాను వెల్లడించింది. మహిళలు పెళ్ళాడిన యువకుల్లో ఎక్కువమంది వయసు వయసు 20 నుంచి 24గా ఉంది. మహిళల వయసు 50కి పైగా కూడా కొన్ని కేసుల్లో నమోదయ్యింది. కింగ్‌డమ్‌లో పెళ్ళి వయసు యువకులకు 18 కాగా, మహిళలకు 16. ప్రత్యేక కారణాల్లో 18, 16 కంటే తక్కువ వయసున్నవారు షరియా కోర్టును ఆశ్రయించవచ్చు. ఇలాంటి కేసుల్లో ముగ్గురు న్యాయమూర్తులుగల ప్యానల్ పరిస్థితిని విచారిస్తుంది. వైవాహిక బంధాన్ని కొనసాగించేందుకు తగినంత స్తోమత వుంటే యువకులు, తమకంటే ఎక్కువ వయసున్నవారిని పెళ్ళాడవచ్చు. మహిళలూ తమకంటే తక్కువ వయసువారిని పెళ్ళాడేందుకు ఇదే సూత్రం వర్తిస్తుంది. అయితే, క్లెరిక్ షేక్ అలి అల్ సాఫి మాట్లాడుతూ, ఇది స్వాగతించాల్సిన విషయం కాదంటున్నారు. అబ్దుల్ సల్మాన్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ప్రేమతో ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు. ప్రేమ, చెడుని కూడా మంచిగా మార్చేస్తుందని అన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







