బలపడ్తున్న దిర్హామ్: వలసదారుల్లో ఆనందం
- July 10, 2018
యూఏఈలో వలసదారులు దిర్హామ్ బలోపేతమవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల కరెన్సీతో పోల్చితే దిర్హామ్ 2018 ప్రథమార్థంలో భారీగా బలపడ్డంతో వలసదారుల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. అమెరికన్ డాలర్‌తో పోల్చితే ఎమిరేటీ కరెన్సీ బలపడటం, అదే సమయంలో అమెరికన్ డాలర్‌తో ఆయా దేశాల కరెన్సీ బలహీనపడటంతో రెమిటెన్స్ చేసినప్పుడు తమ దేశంలోనివారికి పంపే నగదు అధికంగా వెళుతుంది. ఇదే వలసదారుల ఆనందానికి కారణం. యూఏఈ దిర్హామ్‌తో పోల్చితే రూపాయి విలువ 18.8కి పడిపోగా, పాకిస్తానీ రూపీ 33కి పడిపోయింది. బంగ్లాదేశీ టాకా 23కి పడిపోగా, ఫిలిప్పినో పెసో 14.6కి దిగింది. ముందు ముందు యూఏఈ దిర్హామ్ మరింత బలపడ్తుందని కరెన్సీ అనలిస్ట్‌లు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!







