కారు ప్రమాదం.. టాలీవుడ్ హీరోయిన్..
- July 12, 2018
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, సుడిగాడు చిత్రాల నటి మోనాల్ గజ్జర్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. స్నేహితుడి పుట్టిన రోజు కార్యక్రమానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. స్నేహితులతో కలిసి అహ్మదాబాద్ నుంచి ఉదయ్‌పుర్ వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా ఉదయ్‌పుర్ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో అందులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హీరోయిన్ మోనాల్ గజ్జర్ మెడకు దెబ్బతగిలింది. స్థానికులు గమనించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. కాగా తాను మృతిచెందినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేవలం మెడకు దెబ్బ తగిలింది అని అభిమానులనుద్దేశించి మోనాల్ గజ్జర్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- నాట్స్ విస్తరణలో మరో ముందడుగు షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్
- పాక్ ఆరోపణల పై భారతం ఘాటుగా స్పందన!
- రామమందిర నిర్మాణానికి భక్తుల విరాళం రూ.3వేల కోట్ల పైనే..
- బ్రెస్ట్ క్యాన్సర్ పై నాట్స్ అవగాహన సదస్సు
- తిరుమలలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవ సంబరాలు
- అమెరికాలో ఘనంగా ఆటా మహాసభల కిక్ ఆఫ్!
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు







