ట్రంప్‌కు భారత్ ఆహ్వానం
- July 12, 2018
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భారత్ ఆహ్వానించింది. రెండు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా ఉన్నాయని చెప‍్పడానికి అనుగుణంగానే ట్రంప్‌ను భారత్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయానికి అమెరికా దౌత్య అధికారులతో పలుమార్లు చర్చలు జరిపిన తరవాత ట్రంప్‌కు ఆహ్వానం పంపారు. అమెరికా నుంచి దీనికి అధికారికంగా జవాబు రావాల్సి ఉంది.
ట్రంప్ నుంచి గ్రీన్ సిగ్నల్ లాంఛనమేనని, అన్ని రకాల ముందుస్తు చర‍్చలు జరిపిన తర్వాతే ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. 2015 రిపబ్లిక్ డేకి అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరైన సంగతి తెలిసిందే. ఇటీవల వివిధ దేశాలతో వాణిజ్య విషయాల్లో వివాదాస‍్పద నిర్ణయాలు తీసుకుంటున్న ట్రంప్.. భారత్‌ను సైతం టార్గెట్ చేసినప్పటికీ, మోదీ ఆహ్వానాన్ని అంగీకరించే అవకాశాలు అధికంగా ఉన‍్నట్లు దౌత్య వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







