మానవ అవయవాల వ్యాపారం..37 మందికి జైలుశిక్ష
- July 13, 2018
కైరో: అక్రమంగా మానవ అవయవాల వ్యాపారంలో భాగస్వామ్యమైన 37మందికి ఈజిప్ట్ కోర్టు జైలుశిక్ష విధించింది. అవయవ వ్యాపారంలో పాల్గొన్నవారికి కైరో క్రిమినల్ కోర్టు మూడేళ్ల నుంచి గరిష్టంగా 15 ఏండ్ల వరకు జైలు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఆరుగురికి 15 ఏండ్లు, 11 మందికి ఏడేళ్లు, 20 మందికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ కేసులో ముగ్గురిని నిర్దోషులుగా నిర్దారించారు.
డాక్లర్లు, వైద్య విభాగంలో పనిచేసే సిబ్బంది, మధ్యవర్తులు అక్రమ అవయవ మార్పిడి, అవయవాల వాణిజ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు. పేద ఈజిప్షియన్ల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అవయవ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు తేలింది. 2010 చట్టం ప్రకారం మావన అవయవాలను అమ్మడం నేరం. అయితే కడుపేదరికం కారణంగా కొందరు ఈజిప్షియన్లు వారి అవయవాలను అమ్ముకుంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







