2 నెలలు పార్కింగ్‌ ఛార్జీలు తప్పించుకున్న మహిళ అరెస్ట్‌

- July 13, 2018 , by Maagulf
2 నెలలు పార్కింగ్‌ ఛార్జీలు తప్పించుకున్న మహిళ అరెస్ట్‌

ట్రాఫిక్‌ అధికారి ఐడీ కార్డ్‌ సహాయంలో 2 నెలలపాటు పార్కింగ్‌ ఫీజులు చెల్లించకుండా తప్పించుకున్న మహిళను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్‌ చేశారు. రోడ్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) ట్రాఫిక్‌ అధికారి ఒకరు, పెట్రోలింగ్‌ చేస్తుండగా పార్కింగ్‌ ఏరియాలో సహచరుడి ఐడీ కార్డ్‌ పాస్‌తో ఓ మహిళను గుర్తించారు. అయితే అక్కడ తన సహచరుడు లేకపోవడంతో, ఐడీ కార్డ్‌ ఓనర్‌కి ఫోన్‌ చేశారు. ఈ సందర్భంగా మహిళను నిలదీసిన అధికారి, ఆమెకు దొరికిన ఐడీ కార్డ్‌తోనే ఇదంతా చేసిందని గుర్తించారు. రెండు నెలల క్రితం ఆ కార్డ్‌ తనకు దొరికిందని మహిళ విచారణలో అంగీకరించింది. దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com