ట్విట్టర్ షాక్ తగిలిన తారలు
- July 14, 2018
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్.. ఇలా సోషల్ మీడియాలో తమతమ అకౌంట్లకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో ఘనంగా చెప్పుకునే రోజులివి. సినీ స్టార్ల విషయానికొస్తే దీనికి మరింత ప్రాముఖ్యత. అయితే, ఈ విషయంలో బాలీవుడ్ స్టార్ నటీనటులకు తాజాగా పెద్ద షాకే ఇచ్చింది ట్విట్టర్ సంస్థ. ప్రముఖ నటులు అమితాబ్, షారూఖ్, ప్రియాంక చోప్ర, దీపిక పదుకునే వంటి సినీ స్టార్స్ ఫాలోవర్స్ ను భారీగా తగ్గించింది.
ఇటీవల ట్విట్టర్ సంస్థ నకిలీ అకౌంట్లపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. తప్పుడు వివరాలతో అకౌంట్ రన్ చేస్తోన్న ఖాతాదారుల్ని ఏరిపారేస్తోంది. ఇందులో భాగంగా చాలామంది ఖాతాలు గల్లంతయ్యాయి. సినీ స్టార్స్ ను ఫాలో అయ్యే ఇలాంటి నకిలీ గాళ్లంతా పోవడంతో ఆమేరకు ఆయా నటీనటుల ఫాలోవర్ల సంఖ్య తగ్గిపోయింది. ఇలా భారీగా కోతకు గురైన వాళ్లలో అమితాబ్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, మూడు లక్షల పైచిలుకు ఫాలోవర్లు కోల్పోయిన వాళ్లలో షారూఖ్, ప్రియాంకచోప్రా, దీపికా పదుకునే తదితరులు ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







