రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

- July 14, 2018 , by Maagulf
రాజ్యసభకు నలుగురిని నామినేట్‌ చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సిఫారసు మేరకు నలుగురు ప్రముఖులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శనివారం రాజ్యసభకు నామినేట్‌ చేశారు. రాజ్యాగంలోని ఆర్టికల్‌ 80 ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు 12మందిని నామినేట్‌ చేసే అవకాశం ఉంది. కళ, సాంఘీక సేవలలో ప్రత్యేక అనుభ వం , ఆచరణాత్మక అనుభవం కలిగిన వ్యక్తులను సభకు నామినేట్‌ చేయవచ్చు. ఇలా నామినేట్‌ అయిన సభ్యులకు ఆరేళ్ల వ్యవధి ఉంటుంది. కాగా, రాష్ట్రపతి నామినేట్‌ చేసిన సభ్యులలో యుపి మాజీ బిజెపి ఎంపి, దళిత నాయకుడు రామ్‌ షకల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖుడు రాకేశ్‌ సిన్హా, శాస్త్రీయ నృత్యకారుడు సోనాల్‌ మాన్‌సింగ్‌, కళాకారుడు రఘునాథ్‌ మహాపాత్ర తదితరులు ఉన్నారు. రఘునాథ్‌ మహాపాత్ర గత ఆరు దశాబ్దాలుగా భరత నాట్యం, ఒడిస్సి నృత్య ప్రదర్శనలు ఇస్తున్నారు. రాకేశ్‌ సిన్హా ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఇండియా పాలసీ ఫౌండేషన్‌ను స్థాపించారు. ప్రస్తుతం సదరు సంస్థకు గౌరవ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com