ఇండియన్ బ్యాంకర్ యు.ఏ.ఈలో మృతి
- July 17, 2018
యు.ఏ.ఈ:వారం రోజులుగా కన్పించకుండా పోయిన బ్యాంక్ ఉద్యోగి మృతదేహం వెలుగు చూసింది. గుర్తు తెలియని మృతదేహంగా మార్చురీలో ఈ మృతదేహాన్ని భద్రపరచగా, సోషల్ వర్కర్స్, కమ్యూనిటీ గ్రూప్స్ మృతుడెవరన్నదాన్ని గుర్తించేందుకు ప్రయత్నించడం జరిగింది. కాగా, సోమవారం మధ్యాహ్నం మృతుడి సోదరుడు, తన సోదరుడి మృతదేహాన్ని గుర్తించడంతో అతని వివరాలు వెలుగు చూశాయి. అబుదబీలో భారతీయ వలసదారుడు జబర్ నివసిస్తున్నారు. ముస్సాఫ్పా ఇండస్ట్రియల్ ఏరియాలో అతని మృతదేహం కనుగొన్నారు. మృతుడు కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన వ్యక్తి. తొమ్మిదేళ్ళుగా అబుదాబీలో నివాసముంటున్నాడీయన. ఎవరితోనూ తన సోదరుడికి గొడవలు లేవనీ, వారం రోజులుగా ఆయన కన్పించడంలేదని మృతుడి సోదరుడు మునీర్ చెప్పారు. మునీర్ కూడా, తన సోదరుడితోనే కలిసి అదే బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు. మృతుడు జబార్‌కి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతికి గల కారణాన్ని ఫోరెన్సిక్ పరీక్షలతో తెలుసుకోనున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!