షేక్ జాయెద్ రోడ్డుపై కొత్త సాలిక్ గేట్
- July 17, 2018
దుబాయ్:షేక్ జాయెద్ రోడ్డుపై కొత్త సాలిక్ గేట్ ఏర్పాటు కానుంది. అబుదాబీ వైపుగా ఐబిఎన్ బత్తుతా మాల్ త్వాత ఈ సాలిక్ గేట్‌ని ఏర్పాటు చేస్తున్నారు. రానున్న కొద్ది వారాల్లో ఈ సాలిక్ గేట్ అందుబాటులోకి వస్తుంది. అల్ యలాయిస్ స్ట్రీట్‌పై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు వైపు వెళ్ళే బ్రిడ్జి పనులు పూర్తయ్యాక సాలిక్ గేట్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ టోల్ గేట్ ద్వారా షేక్ జాయెద్ రోడ్డులో ట్రాఫిక్ తగ్గుతుంది. దుబాయ్‌లో ఇది ఎనిమిదవ టోల్ గేట్. 62 కిలోమీటర్ల షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ రోడ్డుపై ట్రాఫిక్ కోసం ఈ టోల్ గేట్‌ని ప్లాన్ చేశారు. 2.1 బిలియన్ దిర్హామ్‌ల ఖర్చుతో సెయిహ్ షుబైబ్ (అబుదాబీ - దుబాయ్ బోర్డర్) నుంచి స్వీహాన్ రోడ్ ఇంటర్‌ఛేంజ్ వరకు రూపొందించిన ఈ రోడ్డు 2016లో ట్రాఫిక్‌కి క్లియరెన్స్ పొందింది. చెరో వైపు నాలుగు లేన్లు ఈ రోడ్డు ప్రత్యేకత. గంటకు 8000 వాహనాల కెపాసిటీ ఈ రోడ్డుకి వుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







