ఇండియా:మార్కెట్లో పతంజలి కూరగాయలు
- July 17, 2018
యోగాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బాబా రాందేవ్.. పతంజలి ఉత్పత్తులతో అంతర్జాతీయ గుర్తింపుని తెచ్చుకున్నారు. ఏ ఇంట్లో చూసినా పతంజలి ప్రోడక్ట్స్ దర్శనమిస్తున్నాయి. మరి కొద్ది రోజుల్లో పతంజలి జీన్స్, టీషర్ట్స్ కూడా రాబోతున్నాయి. సిమ్ కార్డులంటూ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా కన్నేసింది పతంజలి సంస్థ. తాజాగా హానికారక ఎరువులు వేసి పండించకుండా సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించే కూరగాయలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పతంజలి బఠానీలు మార్కెట్లో దొరుకుతున్నాయి. మరి కొన్ని కూరగాయలు క్యారెట్, క్యాబేజీ, క్యాలీప్లవర్, మొక్కజొన్న వంటి వాటిని మార్కెట్లోకి తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నారు రాందేవ్. ఈ కొత్త వ్యాపారాల విస్తరణ కోసం 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!