'సంజూ' నాకూ నచ్చాడు.. వీడియో వైరల్

- July 18, 2018 , by Maagulf
'సంజూ' నాకూ నచ్చాడు.. వీడియో వైరల్

బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ బయోపిక్ 'సంజూ'గా తెరకెక్కిన విషయం తెలిసిందే. బాక్సాపీస్ రికార్డులను బ్రేక్ చేస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. కాగా ఈ చిత్రంలోని 'మై బడియా తూ భీ బడియా' అనే పాటకు ముద్దొచ్చే ఓ బుజ్జి బంగారు చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ అందర్నీ ఆకట్టుకుంటోంది. స్కూల్‌కి వెళ్లొచ్చి బ్యాగ్ పక్కన పడేసింది. డ్రస్ మార్చుకో బంగారూ అని అమ్మ వారిస్తున్నా వినకుండా టీవీలో అప్పుడే వస్తున్న సంజూ సినిమాలోని పాటకు పదం కదిపింది. చిట్టి తల్లి డ్యాన్స్ చూసిన అమ్మకు నోట మాట రాలేదు. ఫోన్ తీసుకుని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమ్మతో పాటు మనం కూడా ఫిదా అవ్వాల్సిందే ముద్దులొలికే ఈ చిన్నారి స్టెప్స్‌కి. మరి మీరు కూడా చూసి ఆనందించేయండి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com