మెడికల్‌ సర్టిఫికెట్‌ ఫోర్జింగ్‌: వ్యక్తికి జైలు

- July 20, 2018 , by Maagulf
మెడికల్‌ సర్టిఫికెట్‌ ఫోర్జింగ్‌: వ్యక్తికి జైలు

మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందేందుకు 13 రోజులు కాళ్ళరిగేలా తిరిగిన ఓ వ్యక్తి, విసిగిపోయి ఫోర్జరీకి పాల్పడినందుకుగాను అతనికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. కోర్టులో వెల్లడయిన వివరాల ప్రకారం 30 ఏళ్ళ వ్యక్తి, ఒరిజినల్‌ మెడికల్‌ సర్టిఫికెట్‌ పొందడంలో ఆలస్యమవుతుండడంతో అడ్డదారిలో ఆలోచనలు చేశాడు. ఓ ప్రమాదంలో మెడకు, కుడి చేతికి గాయాలవడంతో కొన్ని రోజులపాటు సల్మానియా మెడికల్‌ కాంప్లెక్స్‌లో ఆ వ్యక్తి వైద్య చికిత్స పొందాల్సి వచ్చింది. అయితే మెడికల్‌ సర్టిఫికెట్‌ లభించకపోవడంతో, మరో వ్యక్తిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులకు చిక్కాడు. అక్రమ మార్గంలో సర్టిఫికెట్‌ కోసం ప్రయత్నించిన నేరానికిగాను మూడేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com