ఓటు హక్కు కోల్పోయిన షరీఫ్
- July 20, 2018
ఇస్లామాబాద్: ఈనెల 25న పాకిస్థాన్‌లో జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె మరియం, అల్లుడు సఫ్దార్ కోల్పోయారు. అవినీతి కేసులో షరీఫ్, మరియంలు రావల్పిండిలో జైలుశిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ఈ నెల 5తో ముగిసింది. దీంతో, వీరికి ఓటు వేసే అవకాశం లేకుండా పోయిందని పాక్ ఎన్నికల సంఘం ప్రతినిధి నదీమ్ ఖాసీం పేర్కొన్నారు. అవెన్ ఫీల్డ్ కేసులో వీరికి ఈ నెల 6న శిక్ష పడిందని, జులై 5 నాటికే ఓటర్ల జాబితాలో ఖైదీల పేర్ల నమోదు గడువు ముగిసిందని, దీంతో, ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని వారు కోల్పోయారని అన్నారు. ఈ విషయమై పునరాలోచించేందుకు ఏమీ లేదని, ఎన్నికల సంఘం కూడా ఏమీ చేయలేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







