అఫ్ఘాన్‌లో తాలిబన్ల దాడి
- July 20, 2018
కాబూల్ : అఫ్ఘనిస్థాన్‌లోని ఘజినీ ప్రావిన్స్‌లో తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8 మంది పోలీసులు మృతి చెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. ఘజినీ ప్రావిన్స్ గవర్నర్ కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...ఖారబాగ్ జిల్లాలోని పోలీసు సెక్యూరిటీ పోస్టుపై తాలిబన్లు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 8 మంది పోలీసులు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్టు తాలిబన్ల అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. తాలిబన్ల దాడి నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. పరిసర ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







