3 నెలలుగా కన్పించకుండాపోయిన భారతీయ వలసదారుడు
- July 21, 2018
యూఏఈలో మూడు నెలలుగా భారతీయ వలసదారుడొకరు కన్పించకుండా పోయాడు. బాధిత కుటుంబం అతని ఆచూకీ కోసం తల్లడిల్లుఓతంది. అబుదాబీలో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి స్మాల్ టైమ్ జాబ్‌ని ఏడాది కాలంగా చేస్తూ వచ్చాడు. రమదాన్ ప్రారంభానికి ముందు ఆ వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడని అతని సన్నిహితుడు పేర్కొన్నారు. అబ్దుల్ లతీఫ్ తన సోదరుడి భర్త అనీ, మే 16 నుంచి అతని ఆచూకీ కన్పించడంలేదని చెప్పారు లతీఫ్ బంధువు రహీమ్. కేరళలోని కన్పూర్కి చెందిన వ్యక్తి రహీమ్. లతీఫ్ ఆచూకీ కోసం అధికారుల్ని సంప్రదించామనీ, అలాగే ఆసుపత్రుల్లోనూ మార్చురీల్లోనూ వెతికామని అబుదాబీ ఔట్ స్కర్ట్స్‌లో నివసించే రహీమ్ చెప్పారు. లతీఫ్‌కి నాలుగేళ్ళ కుమార్తె, భార్య వున్నారని వారంతా అతని ఆచూకీ కోసం కన్నీరు మున్నీరయ్యేలా విలపిస్తున్నారని రహీమ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







